Wednesday, September 5, 2007

ఎర్ర సూర్యోదయం

ముదిగొండలో రక్తపు మరకలు,
గొకుల్ ఛాట్, లుంబినిలలోని మారణ విస్పొటనాలు...
అన్నిటికి ఖండనలు,
జొహార్లతో ఊరేగింపులు...

అందరూ మాట్లాడారు,
ప్రతిపక్షాలు, పాలకపక్షాలు,
అందరూ తప్పు అన్నారు,
సానుభూతి వెలుబుచ్చారు...

ఇదేమి న్యాయం అని అడిగేదవరు?
బాధ్యత వహించాల్సిన వాళ్ళే అడిగారు,
దొంగే దొంగా అని అరచినట్టు
వాళ్ళే సమాధానాలు చెప్పారు...

అందరివీ మౌన సంతాపాలే,
మాట్లాదితే ఎవరూ వినరు కనక...

అసలు వీళ్ళెవరు?
ప్రజలతొ సంబంధం లేని ప్రజాస్వామ్య వాదులు...
పార్టీల పేర్లు వేరు కాని...
వీరందరూ ...ప్రజాస్వామ్యం పేరుతొ ప్రజల గొంతు నొక్కేసినవాళ్ళే

వీళ్ళకి మన రాజకీయాలు, వాళ్ళ తాతల సొమ్ము కింద వదిలేసిన మనకి, వారిని అడిగే హక్కు లేదు, వారిని ఎదిరించే రొమ్ము లేదు... కొంచం ఆత్మ గౌరవం ఉండి ఎవడన్నా గొంతెత్తినా వాడిని ఎక్కిరించే నోరు కల వారందరికి మనం వీపు తడతాం...

ఏంటి ఇది ఇంకా చదువుతున్నరా?
అంత సమయం ఉందా మీకు?
అబ్బొ...
ఎమైపొతే మీకెందుకు ?...
మీ పనికి సమ్యమైందెమొ!?
మీ ఇంట్లొ మీ భార్య పిలుస్తుందెమొ!?
మీ పిల్లలు బడి నుంచి వచ్చారెమొ!?
ఇంట్లొ కురగాయలు ఉన్నాయొ లేవొ!?
నీ ప్రియురాలు సెల్ల్ కి రింగులిస్తుందెమొ!?
పొ
పో రా
"మంచి రాముడ" పొ...

వస్తది ఒక ఎర్ర సుర్యొదయం,ఆ రొజు నువ్వు బయటికి రాలేవు...
అందుకే ఇప్పుడే అనుభవించెయ్యి...

No comments: