Saturday, September 15, 2007

killin life...sex

ప్రియుడు,
ప్రియురాలు,

మానసిక, లైంగిక సహచర్యులు...

పరలింగ సంపర్కం,
స్వలింగ సంపర్కం.

పార్కుల్లో ప్రెమికుల పై ఖాకీల దౌర్జన్యం... నైతికత ప్రస్తావన...

ఇంటెర్నెట్ సెంటెర్లలొ లైంగిక కార్యకలాపలు...

సినిమాల పైన పెదవి విరుపు...

అభ్యుదయ సంఘాల నిరసనలు...

మహిళా సంఘాల ఆందోళనలు,

సనాతన భావల విజ్రుంభన,

ప్రెమ పైన, ప్రెమికుల పైన ...

అనాగరిక దుష్ప్రచారం



ఏమి చెప్పమంటారులే,
ఈ సిత్రాల గురుంచి...


తొటల్లొ, వరి కుప్పల వెనక,
మాల పల్లెల్లొ, మాదిగ గూడెలల్లో...
మాటుగా ఫ్యుడల్ దురహంకారపు చేష్టలు
మరచిపొయారు...


వయసు మీరిన మేన మామల్తో...
వివాహాలని వ్యతిరేకించటం,
మరచిపొయారు...

కట్నాలు ఇవ్వకుండ
కూతుర్ల పెళ్ళిల్లు చెయ్యటం
మరచిపొయారు...

రేపులు, మానభంఘాల పై
వ్యతిరేక ఉద్యమాలు
మరచిపొయారు...

చిన్న ఇళ్ళు...పెద్ద కాపురాలు,
కాపురాలకి చాలని జీతాలు,
మనసుకు నచ్చని వాడితొ మనువులు,
లైంగికత ప్రకటించుకోలేని ప్రపంచం,
లైంగిక ఇచ్చికాలు ప్రకటించుకోనివ్వని సమాజం ...

వీటన్నిటి మధ్యలొ,


ఎదో చిన్న జాగ...

తమ కొరికలకు చొటు,

దొరికినప్పుడు....

స్వాతంత్రత అనుభవిస్తే...

వెంటపడతారేమిటి ?

1 comment:

కొత్త పాళీ said...

సెబాష్. "నో రూం" అని కారా మేస్టారిది కథ ఒకటుంది - గొప్ప కథ.